Telugu Moral Stories, Telugu Neethi Kathalu, Telugu Stories, Telugu Bed Time Stories for Kids.
Telugu Neethi Kathalu-Kopisti Rangaiah
తెలుగు నీతి కథలు - కోపిష్టి రంగయ్య!
హనుమనగరి గ్రామంలో రంగయ్య అనే రైతు కొడుకు రమేష్ పడవ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ బాగా కోపిష్టి. కాకపొతే కొట్లాడిన కోపం దిగిపోగానే వెంటనే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తూ ఉండడంతో రంగయ్య అతన్ని గట్టిగ మందలించాడు. ఒక ఉపాయం పన్నాడు. రమేష్..! నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకు ఒక మీకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలపంతా అందవిహీనంగా కనిపించే సాగింది. ఒక రోజు రంగయ్య రమేష్ కి అది చూపించి ఈ మేకులతో ఈ తలుపు చూడడానికి అసహ్యంగా వుంది కదూ! 'నువ్వు కోపపడే కొద్దీ ఎదుటివారు నిన్ను అలాగే చూస్తారు.' దాంతో రమేష్ అర్ధమైంది నాన్న నేను నా పద్దతిని మార్చుకుంటాను అని చెప్పాడు. మంచిదే నువ్వు కోపాన్ని ఆపుకున్న ప్రతిసారి ఒక్కో మీకు తీసేస్తూ వుండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. ఆటను మీకు తీసిన ప్రతిచోటా ఒక చిన్న చిల్లు మిగిలి పోయింది. రమేష్ కోపం తగ్గి, మేకులన్నిటిని తీసేసిన వాటి తళుకు రంద్రాలు తలుపునిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ బుజం మీద చెయ్యివేసి 'నువ్వు ఎదుటి వాళ్ళ పై కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకుని దించినట్టే. ఆ తరువాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వు ఎంత నిజాయితీగా, శ్రద్దగా మేకుని తీసేసినా ఎదుటివాల్ల మనసుపై ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిప్తోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప పడకూడదు. అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.