Bed Time Stories for Kids - Telugu Moral Stories, Telugu Kadhalu, Telugu Chandama Katalu.
Telugu Moral Stories
స్నేహం చెప్పిన మోసం !
అవంతీ పురాన్ని పాలించే రాజు ఓ ఏనుగును పెంచుకునేవాడు. దాన్ని చూసుకునేందుకు ఒక మావటీని నియమించాడు. ఒకరోజు ఏనుగు ఉండే చోటుకు ఒక ఆవు వచ్చింది. మొదట ఏనుగు దాని చూసి భయపడినా... అది రోజూ రావడంతో రెండింటికీ స్నేహం కుదిరింది. క్రమంగా అది కూడా రాజా భవనంలో వుంది పోవడం మొదలు పెట్టింది. అది మాములు కంటే పాలు ఎక్కువగా ఇవ్వడంతో పెద్దగా ఎవరు పట్టించు కునేవాళ్ళు కాదు. దాంతో ఆవు కూడా ఏనుగుతో సమానంగా అన్ని సదుపాయాలు అందుకునేది. ఓ రైతుకు ఈ ఆవు గురించి తెలిసి మాయావతి దగ్గరికి వెళ్లి...'ఈ అవ్వును కొంటాను అమ్ముతావా' అని అడిగాడు. డబ్బులకు ఆశపడిన మావటి దాని రైతుకు అమ్మేశాడు. ఆ సాయంత్రం నుంచీ ఏనుగు ఆహరం తీసుకోవడం మానేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయం రాజు వరకు వెళ్ళింది. తానెంతో ఇష్టపడే ఏనుగు ఎందుకు మొండికేస్తుందో అర్ధం కానీ రాజు వైదుడిని పిలిచాడు. ఏమి చేసిన ఏనుగు వైఖరి మారక పోవడంతో రాజు మంత్రిని పరిస్థితి ఏమిటో తెలుసుకోమన్నాడు. రహస్యంగా దర్యాప్తు చేసిన మంత్రికి ఏమి జరిగిందో తెలియడంతో విషయాన్నీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. రాజు వెంటనే...'నాకు ఎక్కువ పాలిచ్చే ఆవు కావాలి. తెచ్చి ఇచ్చిన వారికి భారీ బహుమానం కూడా ఇస్తాము అంటూ చాటింపు వేయించాడు. రైతుకు ఈ విషయం తెలిసి ఇంటికి వచ్చినప్పటినించి ఆవు దిగులుగా ఉండడం, ఇంతకు ముందులా పాలు ఇవ్వకపోవడంతో దాని రాజుకు ఇచ్చేస్తే తనకు డబ్బులు వస్తాయని ఆశపడిన రైతు రాజ మందిరానికి వెళ్ళాడు. రాజు ఆ అవును తీసుకెళ్లి...ఏనుగు దగ్గర వదిలిపెట్టడంతో రెండు సంతోషించాయి. దాంతో డబ్బుకు ఆశపడిన మావటిని రాజు శిక్షించాడు. అంతే కాదు ఏనుగుతో పాటు ఆవు కూడా అక్కడే ఉండేలా చూడమంటూ మంత్రిని ఆదేశించాడు.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.