Uses of Carrot Juice - Carrot Juice Upayogalu

Uses of Carrot Juice 

Carrot Juice Upayogalu - Telugu

Uses of Carrot Juice - Carrot Juice Upayogalua

  • క్యారెట్ కూర తింటాం. సాంబారులో వేసుకుంటాము. ఇకపై వీలు ఉన్నప్పుడల్లా  క్యారెట్ రసం కూడా తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
  • క్యారెట్ లో ఏ, సి, కే, విటమిన్లు మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి.  ఇందులోని ఏ విటమిన్ ఊపిరి తిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది.  ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.
  • క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడమే కాదు, అందులో కాస్త తేనే కలిపి చుడండి జలుబూ, గొంతు నొప్పి, త్వరగా తగ్గుతాయి.  
  • జుట్టు ఆరోగ్యాంగా ఉండాలన్నా, చర్మం తాజాగా ఉండాలన్న, క్యారెట్ రసాన్ని మించినది లేదు.  ఈ రసాన్ని రోజూ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.  
  • శుభ్రమైన గ్లాసు జార్ లో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలూ, చెంచా అల్లం తరుగూ, నిమ్మ రసం, కొద్దిగా తేనే వేసి ముఠా పెట్టాలి.  మర్నాడు ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు ఆపులో ఉంటాయి.  శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.  ఎముకలూ దృఢంగా మారుతాయి.  కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.  అలాగే చర్మ సంభందిత అనారోగ్యాలూ దూరమవుతాయి.   

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post