Five Amazing Health Benefits of Spring Onion Soup-Telugu
ఉల్లికాడల సూప్ తో 5 రకాల ఆరోగ్య ప్రయోజనాలు
ఉల్లిపాయ లేకుండా మనకి రోజు గడవదు ఉల్లి కాడలను ఫైడ్ రైస్ లేదా, సలాడ్లలో ఎక్కువగా ఉపయోగిస్తాము అంతేకాని విడిగా ఉల్లికాడలను ఉపయోగించము. ఎందుకంటే వాటి ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి వంటలలో కూడా వాడుకోవడం చేస్తాము...
- ఉల్లికాడలాని ఆంగ్లములో స్ప్రింగ్ ఆనియన్స్ అంటాము. చైనా, జపాన్ వాసులు సలాడ్స్, సూప్ లలో వీటిని ఎక్కువగా వాడుతారు. ముఖ్యంగా సిఫుడ్ లో వీటిని వాడితే నీసువాసన ఉండదు. కాబట్టి అక్కడ వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
- ఉల్లిపాయలతో పోలిస్తే కాడల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో చేదు కొలెస్ట్రాల్ తగ్గి రక్త పీడనం అదుపులో ఉంటుంది.
- జలుబు దగ్గుతో బాధపడే వారు సూప్ లో ఈ కాడలని సన్నగా తరిగి వేసుకుంటే గుణం కనిపిస్తుంది. అలాగే పచ్చి కాడల రసం తీసుకుని అంతే పరిమాణం లో తేనెతో కలిపి తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- వీటిల్లో పెక్టిన్ అనే పదార్థం...పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలు చెడిపోయి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
- పైల్స్ సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉల్లికాడలని వేసి పచ్చిగా తింటే మంచిది. ఫైల్స్ వల్ల వచ్చే వాపు, నొప్పి తగ్గుతాయి.
Post a Comment
Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.