Eight Amazing Health Benefits with Finger Millet (Ragi)

Eight Amazing Health Benefits with Finger Millet (Ragi) -Telugu

రాగి జావతో 8 లాభాలు...


కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క...ఏ మూడింటితో తయారయ్యే రాగి జావ ఒక మంచి ఆరోగ్య ప్రదాయని.  వేసవి కాలంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు వున్నాయి.

  • రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.  దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉంటాయి.
  • రాగిపిండిలో విటమిన్ - సి కూడా ఉంటుంది.  దీన్ని క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు.  చర్మం కూడా ఆరోగ్యాంగా ఉంటుంది.
  • రాగుల్లో ఇనుము మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్త హీనతతో బాధపడే వారు తమ ఆహారంలో రాగుల్ని చేర్చుకుంటే మంచిది. 
  • రాగుల్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. 
  • రాగిపిండిలో పలు రకాలైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడి, ఆందోళనలును తగ్గిస్తాయి. అంతే కాకుండా కండరాల ఆరోగ్యానికి , రక్తం తయారవడానికి జీవక్రియలు సాఫీగా జరగడానికి ఇది ఎంతగవు తోడ్పడుతుంది.
  • రాగుల్లో మాంసకృత్యులు మెండుగా ఉంటాయి.  కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.
  • రాగి పిండి రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  దీన్ని తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.  
  • బరువు తగ్గాలనుకునే వారు రాగులను తరచుగా చేర్చుకోవాలి.  జావా రూపంలోనే కాదు సంగటి రూపంలో కూడా రాగి పిండిని తీసుకోవచ్చు.

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post