7 Tips to Get Smartphone Overuse Under Control

7 Tips to Get Smartphone Overuse Under Control-Telugu

స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు


  • అతిగా సెల్ ఫోన్ వాడడం వలన ఎన్ని సమస్యలు వస్తున్నాయో ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.  అయితే రోజు వారి జీవితంలో ఇది తప్పని సరి అయ్యింది. సెల్ ఫోన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాటుడియేషన్ ముప్పు కొంతైన తగ్గుతుంది. 
  • బ్యాటరీ ఛార్జ్ తక్కువగా వున్నపుడు మాట్లాడ కూడదు. రెండు పాయింట్లు ఛార్జింగ్ ఉన్నపుడు మాట్లాడితే 5 రేట్లు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  • అప్పుడప్పుడు డయల్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్ చెక్ చేసుకోవడం మంచిది. వారానికి ఎన్ని గంటలు మాట్లాడుతున్నామో అర్ధమవుతుంది.  దాన్ని బట్టి తగ్గించుకోవచ్చు. 
  • ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయనవసరం లేదు. చిన్న సందేశాలతో అవతలివారికి చేరవయవచ్చు. మెసేజ్ ఇవ్వడం ఒక అలవాటుగా చేసుకోవడం మంచిది.
  • వేసవిలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గంటల తరబడి ఛార్జింగ్ పెడితే సమస్యలొస్తాయి. మరీ పాత ఫోన్లు ఐతే ఒక్కోసారి పేలే అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చు.  ఎక్కువసార్లు రిపేర్ అయ్యే సమస్య ఉంటే ఫోన్ మార్చేయడం మంచిది. 
  • పూర్తి స్థాయిలో ఛార్జింగ్ పెట్టిన తరువాత కూడా ఛార్జింగ్ తొందరగా ఖర్చు అవుతుంటే బ్యాటరీ మార్చక తప్పదు. 
  • మల్టీమీడియా ఫోన్లలో అప్లికేషన్స్ ని ఆన్ లో ఉంచకూడదు. దీనివల్ల ఇంటర్నెట్ ద్వారా ఆటోమెటిక్ అప్లోడ్స్ పెరిగి పోయి ఫోన్లోని సాఫ్ట్వేర్ నెమ్మదిస్తుంది.  తద్వారా ఇబ్బందులొస్తాయి. 
  • వ్యాపార ఉద్యోగరీత్యా, ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే బ్లుటూత్ ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం మంచిది. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post