Ten Tips for Beautiful Teeth-Tips in Telugu

Ten Tips for Beautiful Teach-Tips in Telugu, Health tips in Telugu, Famous Health Tips in Telugu, Best tips for Beautiful Teeth.

అందమైన పళ్ళు కోసం ఆయుర్వేద చిట్కాలు.

Ten Tips for Beautiful Teeth-Tips in Telugu

  • నిత్యం ఒక చెంసేడు నల్ల నువ్వులు బాగా నమిలితిని, నీళ్లు తాగితే దంతాలు దృడంగా తయారవుతాయి.
  • దంతాల్లో ఏర్పడిన గుంతల్లో ఇంగువను ముద్దగా చేసి ఉంచితే నొప్పి తగ్గుతుంది. 
  • కర్ర బొగ్గుని మెత్తగా చేసి దానితో పళ్ళు తోమితే చిగుళ్లవాపులు, దంతవ్యాధులు తగ్గును. 
  • పసుపు కొమ్మును నిప్పుపై కాల్చి దానిని మెత్తగా చూర్ణము చేసి దంతధావనం చేస్తే మంచి ఫలితం వుంటుంది.

దంతాలు తెల్లగా మెరవాలంటే...


10 ways to get rid of Bad breath naturally-Telugu
  • టీ, కాఫీ లను రోజులో అనేక సార్లు తాగే అలవాటు తగ్గించుకోవాలి.
  • తక్కువ వ్యవధిలో కప్పుల కొద్దీ కాఫీ లేదా టీ తాగడం వల్ల పండ్లపై మచ్చలు ఏర్పడతాయి....ఎక్కువ విరామం తీసుకుని తాగితే మంచిది.
  • ఏదైనా తాగినప్పుడు తిన్నపుడు నోటిని శుభ్రం చేసుకుంటే మంచిది.
  • రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది.

నోటి చేదు వాసన నివారణకు....

  • ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులు నమిలితే నోటి చెడువాసన పోతుంది.
  • లవంగాలను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • రోజూ టీట్రీ ఆయిల్ కొంచెం నోటిలో వేసుకుని పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • సోపు గింజలు నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన నుండి విముక్తి పొందవచ్చు.

పళ్ళు దృడంగా వుండాలంటే...

  • మర్రి పుల్లతో కానీ, మేడి పుల్లతో కానీ, కానుగ పుల్లతో కానీ, వేప పుల్లతో కానీ రెండుపూటలా సున్నితంగా నిదానంగా పళ్ళు తోమాలి.  దీని వలన పళ్ళు క్రమంగా దృఢంగా మారుతాయి.
  • ఒక జామ ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నోటిలో వేసుకుని బాగా నమిలి, ఆ రసాన్ని, దంత మూలాలకు తగిలే విధంగా నాలుకతో రుద్ది అరగంట తరువాత నోరు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post