What is Dynamic Gmail - Gmail Tips and Tricks

Latest Tech News in Telugu : What about Dynamic Gmail, Explain Dynamic Gmail. Options of Dynamic Gmail.

What is Dynamic Gmail - Gmail Tips and Tricks

మొబైల్ కానీ, డెస్క్ టాప్ కానీ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఎక్కువమంది చూసేది Gmail. మన అవసవసరం అలాంటిది.  అలంటి జిమెయిల్లో గూగుల్ సరికొత్త సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే వుంది.  ఇప్పుడు కొత్తగా డైనమిక్ ఈ -మెయిల్  సేవల్ని అందుబాటులోకి తేవడానికి సిద్ధమౌతోంది.  ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి మెయిల్ కి వచ్చే వెబ్ లింక్ లను మెయిల్ లో ఓపెన్ చేసే వీలు ఉండటం.  ఇప్పటివరకు మెయిల్ కి వచ్చిన వెబ్ లింక్ లను క్లిక్ చేస్తే బ్రౌజర్ లో మరో ట్యాబ్ లో ఓపెన్ అవుతాయి.  అప్పుడు మెయిల్ నుంచి బయటకి వచ్చి వేరొక దాన్లోకి వెళ్ళినట్లే. ఆలా కాకుండా జిమెయిల్ లోనే ఉంది ఇన్బాక్స్ లోనే వెబ్ పేజీలను యాక్సిస్ చేయవచ్చు. 
          ఉదాహరణకు అమెజాన్ నుండి ఆఫర్లతో కూడిన డైనమిక్ మెయిల్ వచ్చిందనుకోండి అప్పుడు మెయిల్ ని ఓపెన్ చేసి ఉత్పత్తులని ఇన్బాక్స్ లోనే బ్రౌజ్ చేసి చూడవచ్చు.  నచ్చిన వాటిని కొనుగోలు చేసి బిల్లు చెల్లించడమే.  ఇప్పటికైతే బుకింగ్.కామ్ల, పిటెరెస్ట్, సర్వీసులు ఈ డైనమిక్ మెయిల్స్ పంపేందుకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
ముందు ముందు జిమెయిల్ లో సరికొత్త విధానాన్ని చూడవచ్చు.  ఆండ్రాయిడ్, IOS లకి కొత్త పద్దతిని త్వరలోనే గూగుల్ ప్రవేశపెట్టబోతుంది.  

మరిన్ని ప్రయోజనాలు 

  • నెలవారీగా చెల్లించాల్సిన బిల్లులు మొదలగు సర్వీసుల లింక్స్ ఇన్బాక్స్ లోకి వస్తాయి. బిల్లు చెల్లించేందుకు లింక్ పై క్లిక్ చేస్తే విడిగా ఓపెన్ అవుతాయి. డైనమిక్ మెయిల్ లో ఐతే లింక్ పై క్లిక్ చేస్తే ఇన్బాక్స్ లోనే పేమెంట్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. 
  • ఆఫర్లతో కూడిన హోటల్ బుకింగ్ కి సంబంధించిన డైనమిక్ మెయిల్ వస్తే, ఇంబాక్సలోనే హోటల్కి సంబందించిన  రూముల వివరాలని బ్రౌజ్ చేసి చూడడమే కాదు.  మెయిల్ లో నుంచే రూమ్ బుక్ చేసుకొనవచ్చు. 
  • ఏదైనా ముఖ్యమైన సమావేశానికి సంబందించిన ఇన్విటేషన్ డైనమిక్ మెయిల్ గా వస్తే ... ఆ సమావేశానికి సీటుని అక్కడే రిజర్వు చేసుకోవచ్చు.  అదేవిధంగా ఏదైనా సెర్వెలకు సంబంధించిన  

Post a Comment

Thanks for coming this blog. I will try to update unique content. The contents of this blog are from the Newspaper. It is advisable to consult a doctor or technician when following the health tips.

Previous Post Next Post